శ్రీరామనవమి శుభాకాంక్షలు
మానవుల మనుగడకు దిక్సూచి
అప్పటి రాముడు
త్రేతాయుగపు రాముడు
యుగాలు మారిన
జగాలు మారిన
జనాలు మారిన
మనిషికి మార్గదర్శి
మానవుల మనుగడకు దిక్సూచి
ఎప్పటికీ మరి ఎప్పటికీ
మానవుల మనుగడకు దిక్సూచి
సూర్యవంశపు సూరీడు
సూర్యుని లాగే అందరికీ కావలసిన వాడు.
అలనాటి రాముడు
త్రేతాయుగపు రాముడు
అందరికోసం అవతరించాడు
ఇనకుల సోముడు రఘు రాముడు
ఆదికి అనాదియినా అర్చావతార మై
అందరికోసం అవతరించాడు
ఇనకుల సోముడు రఘు రాముడు
ఏమి చేశాడు ఏమి చూపాడు?
జీవితంలో
అయ్యామాటను కాదనలేదు
అడవికి పోతూ
అమ్మను నిష్ఠూరమాడలేదు
దేనికి పొంగిపోలేదు కృంగిపోలేదు
నిందించలేదు చింతి0చలేదు
అతిగా ఆవేశపడలేదు
బ్రతుకు బండిలో కష్టాల్ సుఖాల్
వస్తాయి పోతాయ్ అంటూ
నిమిత్తమాత్రునిగా నిలబడ్డాడు
స్నేహబంధంలో అంతరాలు చూడలేదు
అర్ధమే జీవిత పరమార్ధం అనుకోలేదు
క్షణ క్షణం అనుక్షణం
ధర్మాన్ని ఆచరించి
ప్రజలకై తపించి
సురులను రక్షించి
అసురులను శిక్షించి
వీరుడు ధీరుడు సూర్యుడై
ఎన్నో సుగుణాలతో
శోబిల్లిన
ఇనకుల సోముడు రఘు రాముడు
ఎప్పటికీ మరి ఎప్పటికీ
మానవుల మనుగడకు దిక్సూచి
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీనివాస్ మరంగంటి
బెంగళూరు

No comments:
Post a Comment